Friday, November 22, 2024

గగన్‌యాన్‌కు ఈ ఏడాదే ఫస్ట్‌ టెస్ట్‌ ఫ్లయిట్.. అంతరిక్షంలోకి మొదటి మానవ సహిత రాకెట్​

అంతరిక్షంలోకి మొట్టమొదటి మానవ సహిత టెస్ట్‌ ఫ్లయిట్‌ను ఈ ఏడాదే పంపించడం జరుగుతుందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ మంగలవారం న్యూఢిల్లిలో ప్రకటించారు. కొవిడ్‌ కారణంగా ఈ ప్రయోగం వాయిదా పడినట్లు ఆయన వెల్లడించారు. గగన్‌యాన్‌ మిషన్‌కుఎంపికైన భారత వాయుసేన సిబ్బందికి రష్యాలో ప్రాథమిక శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు ఆర్బిటల్‌ టెస్టు ఫ్లయిట్‌ ఫలితాల తర్వాత ఇస్రో కనీసం ఇద్దరు ఆస్ట్రోనాట్‌లను 2024 లోపు లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి పంపనుందని ఆయన వెల్లడించారు.

ఈ ఏడాది మొదటి టెస్ట్‌ ఫ్లయిట్‌ తర్వాత వచ్చే ఏడాది ఫిమేల్‌ స్పేస్‌ఫేరింగ్‌ హ్యూమనాయిడ రోబోట్‌ వ్యామ్‌ మిత్రను అంతరిక్షంలోకి పంపించనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. 2018 స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ గగన్‌యాన్‌ మిషన్‌ ప్రకటన చేశారు. 75 సంవత్సరాల ఇండిపెండెన్స్‌ సందర్భంగా అంతరిక్షంలో ముగ్గురు సభ్యుల బృందం ఐదు నుంచి ఏడు రోజులు గడుపుతారని ప్రధాని ప్రకటించారు. గగన్‌యాన్‌కు కేంద్రం రూ. 10,000 కోట్లు కేటాయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement