ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు మరో సిరీస్‌పై కన్నేసింది. రేపటి నుంచి భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. గ్వాలియన్ వేదికగా రేపు రాత్రి 7 గంటల నుంచి తొలి మ్యాచ్ జరగనుంది.
ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. గత కొద్ది కాలంగా గాయంతో క్రికెట్‌కు దూరమైన సూర్య ఇప్పుడు బంగ్లా పొట్టి సిరీస్‌కు పూర్తిగా సిద్ధమయ్యాడు.
అలాగే ఇటీవలే టెస్టు సిరీస్‌లో ఆడిన సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఈ సిరీస్ కోసం యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. అభిషేక్ శర్మ, రింకూ సింగ్, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి వంటి కుర్రాళ్లు ఈ సిరీస్‌లో తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నారు.
మరోవైపు గాయం కారణంగా చాలా కాలంగా ఆటకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. అలాగే సూర్య, హర్ధిక్‌లతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, వాషింగ్టన్ సందర్, అర్ష్‌దీప్ సింగ్‌పై టీమిండియా భారీ అంచనాలు పెట్టుకుంది. అందరు కలిసి కట్టుగా రాణిస్తే భారత్‌కు మరో క్లీన్ స్వీప్ ఖాయం.
ఇక బంగ్లా జట్టును తక్కువ అంచనా వేయకూడదని మాజీలు సూచిస్తున్నారు. సంచలనాలకు మరో పేరైన బంగ్లాదేశ్ ఎప్పుడైనా మ్యాచ్ ఫలితాల్ని తారు మారు చేయగలదు. కీలక ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఆ జట్టు మిగతా ఆటగాళ్లు కూడా ప్రమాదకరమే. ఇటీవలే పాకిస్తాన్ వారి సొంతగడ్డపై ఓడించిన బంగ్లా తర్వాత భారత్ చేతిలో వైట్ వాష్ అయింది. కానీ ఇప్పుడు పొట్టి సిరీస్‌లో సీనియర్ల గైర్హాజరీ బంగ్లాకు ప్లస్ పాయింట్ కావచ్చు.
అందుకే బంగ్లాను ఎట్టి పరిస్థితిలోనూ తెలికగా తీసుకోవద్దని అందరూ సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆ జట్టులో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో, లిటన్ దాస్, మహ్మదుల్లా, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మెహదీ హసన్ మీరాజ్ వంటి అనుభావాజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. వారిని అడ్డుకుంటే టీమిండియాకు మరో సిరీస్ దక్కడం సులభమే. మొత్తంగా బంగ్లాదేశ్‌పై టీ20ల్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న టీమిండియా మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఇరు జట్ల వివరాలు: అంచనా
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్/హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.
బంగ్లాదేశ్: లిటన్ దాస్ (వికెట్ కీపర్), పర్వేజ్ హొస్సేన్, తంజీద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మెహదీ హసన్ మీరాజ్, తౌహిత్ హ్రిదోయ్, మహ్మదుల్లా, రిషాద్ హుస్సేన్, తంజీమ్ హసన్ షకీబ్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రాహ్మాన్.