Saturday, November 23, 2024

తెలుగు షార్ట్ ఫిల్మ్ ‘స్ట్రీట్ స్టూడెంట్’కు నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్స్ లో ఫస్ట్ ప్రైజ్…

జాతీయ మానవ హక్కుల సంఘం నిర్వహించే లఘు చిత్రాల (షార్ట్ ఫిల్మ్) పోటీలో జాతీయస్థాయిలో తెలుగు షార్ట్ ఫిల్మ్ ‘స్ట్రీట్ స్టూడెంట్’ మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడేళ్లుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక లఘు చిత్రాల పోటీలో ఈ ఏడాది జాబితాలో దేశవ్యాప్తంగా వేర్వేరు భాషల్లో మొత్తం 190 చిత్రాలు పోటీ పడ్డాయి. వాటిలో ఆకుల సందీప్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ‘స్ట్రీట్ స్టూడెంట్’ మొదటి స్థానంలో నిలించింది. అవార్డు కింద రూ. 2 లక్షలు విజేతకు అందించనున్నారు. వీధి బాలల విద్యా హక్కు, ఆ హక్కును వారికి అందించే విషయంలో సమాజం బాధ్యతను గుర్తుచేసేలా సందీప్ రూపొందించిన ఈ చిత్రం జ్యూరీ ప్రశంసలు అందుకుంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో సందీప్ ఈ సినిమాను పోటీకి పంపించారు.

మణిపూర్‌కు చెందిన రోమి మీటీ రూపొందించిన లఘు చిత్రం ‘కర్ఫ్యూ’ ద్వితీయ బహుమతికి ఎంపికైంది. స్థానిక మీటీలియన్ భాషలో రూపొందించిన ఈ చిత్ర రూపకర్త ద్వితీయ బహుమతిగా రూ. 1.5 లక్షలు పొందనున్నారు. నీలేశ్ అంబేద్కర్ రూపొందించిన మరాఠీ షార్ట్ ఫిల్మ్ ‘ముంఘ్యార్’ మూడవ బహుమతికి ఎంపికైంది. విజేతకు రూ. 1 లక్ష బహుమానం అందించనున్నారు. ఈ ఏడాది స్పెషల్ మెన్షన్ కింద ఎంపికైన చిత్రాలకు రూ. 50 వేల నగదు బహుమానాన్ని అందించనున్నట్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement