Monday, November 25, 2024

Mpox | భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు

దేశంలో మొట్టమొదటి మంకీపాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అతడిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అతనికి పరీక్షలు నిర్వహించగా, మంకీపాక్స్ వైరస్ పాజిటివ్ అని తేలిందని… అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

మంకీపాక్స్ వ్యాధి నివారణకు అన్ని రాష్ట్రాలు ఆరోగ్య చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఆదేశించారు. మంకీపాక్స్ కు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించాలని రాష్ట్రాలను కోరారు. మంకీపాక్స్‌పై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) జారీ చేసిన CD-అలర్ట్ (కమ్యూనికేబుల్ డిసీజ్ అలర్ట్)పై చర్య తీసుకోవాలని సూచించబడింది.

లక్షణాలు ఇవే..

ఈ వైరస్‌తో ఇన్ఫెక్షన్ చాలా దుష్ప్రభావాలను కలిగి ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకం కావచ్చు. దీని కారణంగా ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంపై చీము నిండిన బొబ్బలు ఏర్పడతాయి. ఈ వైరస్ ఆర్థోపాక్స్ వైరస్ జాతి కుటుంబానికి చెందినది. ఇది మశూచికి కూడా కారణమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement