Sunday, January 12, 2025

HMPV | అస్సాంలో తొలి హెచ్‌ఎంపీవీ కేసు.. 10 నెలల చిన్నారికి పాజిటివ్

అస్సాంలో 10 నెలల చిన్నారికి HMPV పాజిటివ్ అని తేలింది. అయితే అసోంలో ఇదే తొలి కేసు కావడం గమనార్హం. ఈ విషయాన్ని అధికారులు శనివారం వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం సీజనల్ వ్యాధులతో చిన్నారి ప్రభుత్వాసుపత్రిలో చేరిందని డాక్టర్ ధృబజ్యోతి భుయాన్ తెలిపారు. ప్ర‌స్తుతం చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

చైనాలో శీతాకాల మార్పులతో ఇన్‌ఫ్లుఎంజా, ఆర్‌ఎస్‌వి, హెచ్‌ఎంపివి వంటి వైరస్‌లు విస్తరిస్తున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. అయితే భారతదేశంలోని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ వైరస్‌లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement