Thursday, November 21, 2024

తొలి డోసు కొవాగ్జిన్.. రెండో డోసు కొవిషీల్డ్

కరోనా వ్యాక్సిన్ కోసం వెళ్లిన ఓ వ్యక్తికి తొలి డోసు కొవాగ్జిన్ ఇచ్చిన ఆసుపత్రి సిబ్బంది… రెండో డోసు కొవిషీల్డ్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ జిల్లాలో జరిగింది ఈ సంఘటన. దీంతో వైద్య సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహరాజ్ గంజ్ జిల్లా ముఖ్య అభివృద్ధి అధికారి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న ఉమేశ్ గత నెలలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. అతడికి తొలి డోసు కొవాగ్జిన్ ఇచ్చారు. తాజాగా రెండో డోసు కోసం ఆసుపత్రికి వెళ్లిన ఉమేశ్ కు అక్కడి సిబ్బంది కొవాగ్జిన్ ఇవ్వాల్సింది పోయి కొవిషీల్డ్ డోసు ఇచ్చారు. 

ఈ సంగతి గ్రహించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఉమేశ్ తో పాటు గత నెలలో కొవాగ్జిన్ డోసు తీసుకున్న మిగతా డ్రైవర్లు చందన్, మదన్ లకు రెండో డోసు నిలిపివేశారు. లేకుంటే వారిద్దరికీ కూడా కొవిషీల్డ్ డోసునే ఇచ్చేవారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పందించారు. ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. అయితే రెండు డిపరెంట్ వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికి అతడికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లుు లేవు. యూపీలో ఇలాంటి ఘటనలు కొత్త కాదు. ఇటీవల కరోనా టీకా కోసం ఆసుపత్రికి వెళ్లిన మహిళలకు అక్కడి సిబ్బంది రేబీస్ టీకాలు ఇవ్వడం దిగ్భ్రాంతి కలిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement