కరోనా మహమ్మారిపైని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాక్సిన్లు వచ్చాయి. అయితే అయితే, అక్కడక్కడ వ్యాక్సిన్లు వికటించిన మృతిచెందినట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా, న్యూజిలాండ్‌లో ఓ మహిళ మృతిచెందారు.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అత్యంత అరుదైన మయోకార్డిటిస్ అంటే గుండె కండరాల్లో ఇన్‌ఫ్లేమేషన్‌తో ఆ మహిళ చనిపోయినట్టు భావిస్తున్నామని.. ఫైజర్ వ్యాక్సిన్ వల్ల దేశంలో సంభవించిన తొలి మరణం ఇదేనని ప్రకటించింది న్యూజిలాండ్. ఇక, ఆ మహిళ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని కూడా తెలిపింది. మరోవైపు.. ఫైజర్ వ్యాక్సిన్ వల్ల కలిగే అనర్థాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని కూడా వెల్లడించింది.
ఇది కూడా చదవండి: పన్నుల మోతలో ఏపీ నెంబర్ వన్ః దేవినేని ఉమా