Friday, November 8, 2024

న్యూ కొవిడ్‌ వేరియంట్‌తో థాయిలో మొదటి మరణం..

కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ఆర్కురస్‌తో ఓ వ్యక్తి మరణించాడు. ఈ కొత్త వేరియంట్‌తో సంభవించిన మొదటి మరణం ఇదేనని థాయిలాండ్‌ ఆరోగ్య అధికారులు ప్రకటించారు. ప్రధాన ఉప వేరియంట్‌ కంటే 1-2 రెట్లు అధిక వేగంతో వ్యాపించే వ్యాధి ఇది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల పెరుగుదల మధ్య థాయిలాండ్‌లో మొదటి మరణం నమోదైంది. ఏప్రిల్‌ 17 నాటికి థాయిలాండ్‌లో ఎక్స్‌బీబీ.1.16 మొత్తం కేసులు 27 కనుగొనగా, వాటిలో మొదటి మరణం ఇదేనని థాయి డాక్టర్‌ సిరిలక్‌ పేర్కొన్నారు. ఈ కొత్త వేరియంట్‌తో మరణించినది ఓ వృద్ధుడని, అతని మరణం సబ్‌వేరియంట్‌ తీవ్రతను నేరుగా ప్రతిబింబించకపోవచ్చు. అయితే ఇతర ప్రమాద కారకాలపై దాని ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని ఆరోగ్య అధికారి తెలిపారు. మొదటి మరణం సంభవించిన నేపథ్యంలో ఆరోగ్య అధికారులు ఎక్స్‌బీబీ.1.16కి సంబంధించి హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


ఇది ఎంత ప్రమాదకరం..?

ఆర్కురస్‌ను మొదట జసవరిలో కనుగొన్నారు. ఇది సులభంగా వ్యాప్తి చెందగల ఓమిక్రాన్‌ ఉప వేరియంట్‌. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ దాదాపుగా ఎక్స్‌బీబీ1.15 వేరియంట్‌ను పోలి ఉంటుంది. కాని అదనపు మ్ముటేషన్‌ను కలిగి ఉండటం వలన త్వరగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే ఆర్కురస్‌ భారత్‌లో ఇతర రూపాంతరాలుగా మార్పు చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది భారత్‌లో వేగంగా విస్తరించవచ్చు. అయితే ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

- Advertisement -

లక్షణాలు : ఆర్కురస్‌ ఎక్స్‌బీబీ.1.16 లక్షణాలలో ప్రధానంగా జ్వరం, తలనొప్పి, గొంతు మంట, జలుబు, అలసట, ఉదర సమస్యలు, దగ్గు ఉంటుంది. కొంత మంది రోగుల్లో కళ్ల దురద, కండ్లకలక లాంటి లక్షణాలు ఉంటాయి. కంటికి సంబంధించిన ఈ లక్షణాలు మునుపటి వేవ్స్‌లో కనిపించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement