ప్రకాశం జిల్లాలో చీరాల నుండి తొలి బ్లాక్ ఫంగస్ మరణం నమోదైంది. పేరాలకు చెందిన ఒకరికి 10 రోజుల క్రితం కరోనా సోకింది. వెంటనే గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ సమయంలోనే మృతుడికి బ్లాక్ ఫంగస్ సోకింది. దీంతో హైదరాబాద్‌లోని సన్ షైన్ హాస్పిటల్‌కు తరలించారు. శనివారం శస్త్రచికిత్స చేసి దవడను తొలగించి వెంటిలేటర్ మీద ఉంచారు. సోమవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు.
మరోవైపు జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఒకరు, మార్కాపురంలో ఐదుగురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. కోవిడ్ చికిత్సకు స్టెరాయిడ్స్ వాడకం వల్ల దుష్ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ వ్యాధికి సరైనా వైద్యం అందించడం తెలియకపోయినా బాధితుల భయాలను క్యాష్ చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాపారం మొదలు పెట్టాయి. రోగుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ తెలిసి కూడా జిల్లా అధికార యంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు.