Tuesday, November 19, 2024

First Anniversary Celebrations – ప్ర‌జా పాల‌న విజయోత్స‌వ స‌భ‌కు ఓరుగ‌ల్లు రెడీ…….

ఉమ్మడి వరంగల్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభ కు వరంగల్ ముస్తాబైంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఇందిరాగాంధీ జయంతి రోజైన నేడు ఈ సభ నిర్వహిస్తున్నారు. సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా పేరు పెట్టారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరవుతున్నారు. లక్ష మందితో సభ నిర్వహిస్తామని మంత్రులు చెబుతున్నారు. కాగా ప్లెక్సీలు, కటౌట్లతో ఓరుగల్లు మూడు రంగులమయమైంది. పోరుగడ్డ‌ ఓరుగల్లు జిల్లాలో లక్ష మందిమహిళలతో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసి చరిత్రలోనే నిలిచిపోయే విధంగా వేడుకలను నిర్వహించా లని విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళల్లో అప్పటి ముఖ్య మంత్రి కేసిఆర్‌ తొలితరం తెలంగాణ ఉద్యమనేత, తెలంగాణ భావజాల వ్యాప్తి చేసిన అభ్యుదయ కవి కాళోజీ నారాయణ రావు స్మారక భవన నిర్మాణానికి 2014 సెప్టెంబర్‌ 9న శంకుస్థాపన చేశారు. ఏడాదిలోని పూర్తిచేయాలని చెప్పినప్ప టికీ… పదేళ్లైనా కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పూర్తి కాలేదు. 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తిచేస్తామని ప్రస్తుత ముఖ్య మంత్రి, అప్పటి టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. చెప్పినట్లుగానే కాంగ్రె స్‌ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యేగా గెలుపొందిన నాయిని రాజేందర్‌రెడ్డి వెంటపడి ప్రత్యేక నిధులుతెప్పించి ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే పూర్తిచేయించారు. నేడు సీఎం రేవంత్‌ ప్రారంభోత్సవం చేయబోతున్నారు.

- Advertisement -

22 జిల్లాల్లో శంకుస్థాపనలు
మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకుపోతున్నది. మహిళలను వ్యాపారవేత్తలుగా చూడాలని ఉద్దేశ్యంతో వారికి సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా ఇవ్వబోతు న్నారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇందిరామహిళా శక్తి భవనా లను నిర్మాణాలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది. దానికి అనుగుణంగానే మంగళవారం సీఎం రేవంత్‌ మంత్రులతో కలిసి 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఇందుకు సంబం ధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. అదేవిధంగా బహిరంగ సభ వేదికపైనే విద్యుత్‌, ఆర్టీసీ శాఖలతో మహిళా సంఘాలతో ఎంఓయూ చేయనున్నారు. అలాగే మహిళలకు బ్యాంకు లింకేజికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేస్తారు.

హనుమకొండలో బహిరంగ సభ

హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రపంచ చరిత్రలోనే ఒకేచోట లక్ష మంది మహిళలను సమావేశపరిచి సభ నిర్వహించిన ఘనతను ఓరుగల్లుకు దక్కేలా స న్నాహాలు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 అసెంబ్లి నియోజకవర్గాల నుంచి నియోజక వర్గాలతో పాటుగా వరంగల్‌ నగరంలో ట్రైసిటి నుంచి 50 వేల మంది మహిళలను సభకు తరలించేందుకు కోసం ఏర్పాట్లు పూర్తిచేశారు.

సీఎం టూర్‌ షెడ్యూల్‌ ఇలా…
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు హనుమకొండలోని ‘కుడా’ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కాళోజీ కళాక్షేత్రాని కి వెళ్లి స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభిస్తారు. 3.10 నిమిషాలకు కాళోజీ ప్రాంగణం నుంచి ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు.. సాయంత్రం 4 నుంచి 4.20 నిమిషాల వరకు మంత్రులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. 4.20 నుంచి 4.30 నిమిషాల వరకు రాష్ట్రంలోని 22 జిల్లాల్లో నిర్మాణాలు చేయబోయే ఇందిరన్ము మహిళా శక్తి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా మహిళలకు బ్యాంకు లింకేజీల చెక్కులను అందిస్తారు. 4.40 నుంచి 5 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement