Friday, November 22, 2024

అగ్ని గుండంగా మణిపూర్ – కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు

మణిపూర్ రాజధాని ఇంపాల్ సహా ఇతర ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధ్వంసకరంగా ఎవరైనా కనిపిస్తే అక్కడే కాల్చేయమంటూ మణిపూర్ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగా.. మరో 55 ఆర్మీ బలగాలను తాజాగా మోహరించారు.

పెద్ద సంఖ్యలో ఉన్న మెయిటీ వర్గం ప్రజలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. దీనికి ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ నాయకత్వం వహిస్తోంది. అయితే తమకు సంఘీభావం తెలుపుతున్న నిరసనకారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ఈ సంఘం ఖండించింది. ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ ఇంఫాల్‌ తదితర ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను తగులబెట్టారని అన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. ఉద్రిక్తతలను సడలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనులు ప్రశాంతంగా ఉండాలని పావోటింఠాంగ్ లుఫెంగ్ కోరారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement