హర్యానాలోని పంచకులలో (శుక్రవారం) కాంగ్రెస్ అభ్యర్థి కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. కల్కా సీటు నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి కాన్వాయ్ పై జరిగిన ఈ కాల్పుల్లో అతని మద్దతుదారు గోల్డీ ఖేడీ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన కార్యకర్తలు చికిత్స కోసం PGI ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పుల జరిపిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.