Monday, November 18, 2024

డెన్మార్క్‌ మాల్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి, మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు..

డెన్మార్క్‌ దేశంలోని మాల్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. డెన్మార్క్‌లోని కోపెన్‌హగన్‌లోని ఒక షాపింగ్‌ సెంటర్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మాల్‌ లోపల ఉన్న వ్యక్తులు పోలీసుల సహాయం కోసం వేచి ఉం డాలని డెన్మార్క్‌ పోలీసులు సూచించారు. డెన్మార్క్‌ రాజధానినగరంలో రద్దీగా ఉండే షాపింగ్‌ మాల్‌లో సాయుధుడు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాల్పుల తర్వాత 22 ఏళ్ల డానిష్‌ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కాల్పుల్లో మరెవరి ప్రమేయం లేదని, అయినప్పటికీ తాము ఇంకా దర్యాప్తు చేస్తున్నామని కోపెన్‌హగన్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సోరెన్‌ థామస్సేన్‌ చెప్పారు.

డెన్మార్క్‌ దేశంలో కాల్పులు జరపడం చాలా అరుదు. కాల్పులు జరిగినప్పుడు కొందరు వ్యక్తులు దుకాణాల్లో దాక్కున్నారు. మరి కొందరు భయాందోళనలతో తొక్కిసలాటలో పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పుల తర్వాత సాయుధ పోలీసు అధికారులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ చేశారు. పలు అగ్నిమాపక శాఖ వాహనాలు కూడా మాల్‌ వెలుపల పార్కింగ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement