లూయిస్‌విల్: అమెరికా లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌విల్ లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు…ఒక పోలీసు అధికారి సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ బ్యాంకు ఎదుట గుమిగూడిన జనంపైకి దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడున్న బ్యాంకు భద్రత సిబ్బంది దుండగుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని తమ అధీనం తీసుకున్నారు. అయితే దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ ఘటన ఉగ్రవాద చర్య కాకపోవచ్చని పోలీసులు చెబుతున్నారు. తాజా ఘటనపై లూయిస్‌విల్ మేయర్ క్రెయిగ్ గ్రీన్‌బెర్గ్ స్పందించారు. తదుపరి నోటీసులు వచ్చేవరకు పరిసర ప్రాంత ప్రజలు సంఘటన స్థలం సమీపంలోకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ లూయిస్‌విల్ గవర్నర్ అండే బెస్‌హియర్ అంజలి ఘటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement