చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలోని హిదూర్ అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. పోలీసుల, మావోయిస్టులకు మధ్య భీకరంగా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
అయితే, హిదూర్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీస్ పార్టీ, బీఎస్ఎఫ్ బృందం ఆపరేషన్ కోసం అక్కడి వెళ్లింది. అడవుల్లో వారు గన్ ఫైర్ చేస్తుండగానే మావోయిస్టులు వారికి తారసపడ్డారు. దీంతో ముందుగా ఇరు వైపుల నుంచి ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఆపరేషన్‌లో పోలీసులతో సహా బీఎస్ఎఫ్ డీఆర్జీ దళాలు మావోయిస్టులతో పోరాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో కానిస్టేబుల్ రమేష్, ఓ మహిళా మావోయిస్టు దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా మృతి చెందిన మావోయిస్టు నుంచి భద్రతా దళాలు కే-47రైఫిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎన్‌కౌంటర్‌ను పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.