Tuesday, November 26, 2024

స్పైస్ జెట్ విమానంలో మంట‌లు…

పాట్నాలో స్పైస్ జెట్ విమానం ఇంజ‌న్ లో సాంకేతిక లోపం వ‌ల్ల మంట‌లు చెల‌రేగాయి. టేక‌ప్ స‌మ‌యంలో ఈ మంట‌లు వ‌చ్చిన‌ట్లు పైల‌ట్లు గుర్తించారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పైల‌ట్లు విమానాన్ని బిహ‌టా ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్ లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ‌న‌ష్టం జ‌ర‌క్క‌పోవ‌డంతో ఎయిర్ లైన్స్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇంజ‌న్ లో మంట‌లు చెల‌రేగ‌డానికి గ‌ల కార‌ణాలను గుర్తించే ప‌నిలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement