Thursday, November 21, 2024

రాబోయే రెండు, మూడు రోజులు నిప్పుల కొలిమే.. వాతావరణ శాఖ హెచ్చరికలు..

న్యూఢిల్లి: రాబోయే రెండుమూడు రోజుల్లో వాయువ్య మరియు సెంట్రల్‌ ఇండియా నిప్పులకొలిమిలా మారనుందని వాతావరణశాఖ శనివారం హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లి లో మే నెల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రతిరోజూ 40 డిగ్రీల సెల్సియస్‌ పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో, మండే ఎండలతో రాజధానివాసులు ఉక్కిరిబిక్కరి అయ్యారు. కానీ,కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాలతో,ఢిల్లి వాతావరణం కాస్త అధిక ఉష్ణోగ్రతల నుంచి తేరుకుంది. ఢిల్లి లో శుక్రవారం నమోదైన 42 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను వాతావరణశాఖ ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రతని ప్రకటించింది.

ఉరుములు, పిడుగులతో కూడిన భారీవర్షాల తర్వాత నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలకు ఈ వారం ప్రారంభంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు .ఈనెల 7వ తేదీ నుంచి దక్షిణ భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియా మెట్రోలాజికల్‌ డిపార్టమెంటు (ఐఎండి) ప్రకటించింది.ఈశాన్య మరియు పశ్చిమబెంగాల్‌, సిక్కిం ప్రాంతాల్లో సైతం మరో ఐదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement