కెనడాలోని టొరంటో విమానాశ్రయం నుంచి న్యూయార్క్ బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు లేచాయి. దీంతో విమానాన్ని పైలట్ వెనక్కి తిప్పి మళ్లీ టొరంటో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశాడు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 74 మంది ప్రయాణికులున్నారు.
- Advertisement -
విమానం టేకాఫ్ అయిన తర్వాత పైలట్ విమానాన్ని అత్యంత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో విండ్‌షీల్డ్ వద్ద మిరుగులు వచ్చాయి. దీంతో పాటు కాక్‌పిట్‌లో వైరు కాలిన వాసనను పైలట్ గమనించాడు. దీంతో వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి తెలియజేశాడు. వారు ఓకే అనడంతో పైలట్ విమానాన్ని వెనక్కు తిప్పి మళ్లీ టొరంటోలో ల్యాండ్ చేశాడు.