మధ్యప్రదేశ్‌ని జబల్‌పుర్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఘొర అగ్న ప్రమాదం జరిగింది. దామోహ్ నాకా ప్రాంతంలో ఉన్న న్యూలైఫ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. చనిపోయినవారిలో ఐదుగురు రోగులు, ముగ్గురు ఆసుపత్రి సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మరో తొమ్మిదిమంది గాయపడ్డారు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలోని రోగులు భయాందోళనకు గురయ్యారు. హాహాకారాలు చేస్తూ.. పరుగులు తీసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న సోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్పత్రిలోని రోగులను బయటకు తరలించారు. షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.