Monday, November 18, 2024

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు, నిందితుల ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేత..

సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే బుల్డోజర్లతో సమాధానం చెబుతామని ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హెచ్చరికలు చేయడంతోపాటు అమలు కూడా చేశారు. తాజాగా అసోంలోనూ అదే విధానం అమలైంది. నగావ్‌ జిల్లా బటద్రవా పోలీస్‌స్టేషన్‌పై కొందరు దుండగులు దాడి చేసి నిప్పంటించారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను గుర్తించి, వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలిలా ఉన్నాయి. బటద్రవా పోలీస్‌స్టేసన్‌ పరిధిలో ఓ కేసులో సఫీకుల్‌ అనే అనుమానితుడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అనారోగ్యానికి గురికాగా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మూకుమ్మడిగా బటద్రవా పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికార యంత్రాంగం బాధ్యులను గుర్తించి కఠిన చర్యలకు పూనుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement