శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న బ్యాటరీ కంపెనీ భవనంలో మంటలు చెలరేగాయి.
దీంతో భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.