తైవాన్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 13 అంతస్తుల నివాస సముదాయంలో తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ అగ్నికీలల్లో 46 మంది చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా, మరో 55 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. నివాస సముదాయంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు.
అయితే భవన శిథిలాల్లో చిక్కుక్కున్న వారి కోసం ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భవనంలోని కింది అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది పేర్కొన్నది. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలోని పైఅంతస్తుల్లో కుటుంబాలు బస చేస్తుండగా, కింది అంతస్తుల్లో దుకాణ సముదాయాలు ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.