సకాలంలో స్పందించిన సిబ్బంది
మంటలను అదుపు చేసిన అగ్నిమాపక దళం
విద్యుత్ షార్ట్ సర్య్యూట్ కారణంగా ప్రమాదం
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రాంగణంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. కోర్టు నెంబర్ 11, 12ల మధ్య ఉన్న వెయిటింగ్ ఏరియాలో నేటి మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సుప్రీంకోర్టు సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని సుప్రీంకోర్టు సిబ్బంది ప్రకటించారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదంతో కోర్టు కార్యకలాపాలకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది.