మాదాపూర్‌లోని కొత్తగూడ చౌరస్తా వద్ద ఉన్న మహీంద్రా కార్ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షోరూమ్ నుంచి భారీ మంటలు చెలరేగాయి. దీంతో ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.