హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా పేలి రెండు పడవల్లో మంటలు చెలరేగాయి.. దీంతో రెండు పడవలు దగ్ధమయ్యాయి.
కాగా, నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో “మహాహారతి” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాణసంచా కాల్చారు.. ఈ క్రమంలో రెండు పడవలకు మంటలు వ్యాపించడంతో రెండు బోట్లు దగ్ధమయ్యాయి. ఘటన సమయంలో బోటులో 15 మంది ప్రయాణికులు ఉండగా వారు సురక్షితంగా బయటపడ్డారు.