Saturday, November 23, 2024

విశాఖ సెజ్‌లో అగ్నిప్రమాదం

విశాఖపట్నం జిల్లా దువ్వాడలోని సెజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పూజా స్క్రాప్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. చాలా ఎత్తు వరకు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement