ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని ఓ ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలో ఇవ్వాల (శుక్రవారం) సాయత్రం భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మహాలక్ష్మి ఎస్టేట్ వెనుక ఉన్న చిత్రకూట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫిల్మ్ సెట్లో నల్లటి పొగలు కనిపించాయి. బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీ సెట్.. దర్శకుడు లవ్ రంజన్‌కు చెందినది. నటుడు సన్నీ డియోల్ కుమారుడు రాజ్వీర్ పక్కనే ఉన్న సెట్లో ఉన్నాడు. భద్రతా బృందం అతన్ని సేఫ్ ప్లేస్ కి తరలించింది.
సాయంత్రం 4:28 గంటలకు అగ్నిమాపక దళానికి కాల్ వచ్చింది. దీంతో ఘటనా స్ధలానికి ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు, రెండు వాటర్ ట్యాంకర్లు చేరుకున్నాయి. లెవెల్ 2 ఫైర్‌గా గుర్తించిన ఈ మంటలు స్టూడియోకు సమీపంలోని డీఎన్ నగర్ ప్రాంతంలోని భవనంలో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని షాపులో అగ్నిప్రమాదం జరగ్గా మంటలు వ్యాపించాయని తెలిసింది. అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఈ స్టూడియోలోనే రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్‌లపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. స్టూడియోలో అగ్నిప్రమాదంలో మూవీ సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.