Friday, November 22, 2024

Madhya Pradesh: ఇంట్లో అగ్ని ప్రమాదం.. రెండో అంతస్తు నుంచి దూకి బాలిక మృతి

మ‌ధ్యప్ర‌దేశ్‌లో ఓ ఇంట్లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో భ‌య‌ప‌డిపోయిన 13ఏళ్ల బాలిక రెండో అంత‌స్తు నుంచి కిందికి దూకి మృతి చెంది. ఈ ప్రమాదంలో ఆమె తల్లి, సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు.

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో రెండంతస్తుల ఇంట్లో కుటుంబం మంటల్లో చిక్కుకుంది. అయితే బాలిక ఇంటి దగ్గర ఉన్న టార్పాలిన్‌పైకి దూకితే ప్రాణాలను రక్షించుకోవచ్చాని భావించిన ఆమె.. ఖచ్చితంగా టార్పాలిన్ మీద దూకింది కానీ ఆమె బరువు కారణంగా ప్లాస్టిక్ టార్పాలిన్ చిరిగిపోవడంతో సీసీ రోడ్డు మీద పడిపోవడంతో బలంగా తలకు గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయింది.

కాగా, ప్రమాదంలో బాలిక తల్లి, సోదరుడు అపస్మారక స్థితికి చేరుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొద్దిసేపటికే మొదటి అంతస్తులో మంటలు పూర్తిగా వ్యాపించాయి. దీంతో భయపడిన 13 ఏళ్ల బాలిక రెండో అంతస్తు నుంచి కిందకు దూకింది అని పోలీసులు పేర్కొన్నారు. మృతురాలి పేరు ఏంజెల్ జైన్ అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యష్ బిజోలియా తెలిపారు. ఈ ప్రమాదం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement