Thursday, December 19, 2024

FIR – రాహుల్ గాంధీపై కేసు న‌మోదు ..

న్యూఢిల్లీ, : పార్లమెంట్‌ ఆవరణలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ నేపథ్యంలో తమపై దాడికి పాల్పడ్డారంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు రాహుల్ గాంధీని ప్ర‌శ్నించ‌నున్నారు..

ఇది ఇలా ఉంటే బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి మాట్లాడుతూ.. ఎంపీని తనపైకి రాహుల్ గాంధీ నెట్టారని తెలిపారు. దీంతో సదరు ఎంపీ తనపై పడడంతో తాను మెట్లపై పడిపోయానని ప్రతాప్ చెప్పారు. గాయపడిన సారంగిని పార్లమెంట్ భద్రతా సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. బిజెపి స‌భ్యులు త‌న‌ను అడ్డుకున్నార‌ని, ఈ సంద‌ర్భంగా జ‌రిగిన తోపులాట‌లో కొంద‌రు ఎంపిలు కింద ప‌డ్డార‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement