ఫిన్‌టెక్ ఫెస్టివల్ ఇండియా, దేశంలోనే అతిపెద్ద ఫిన్‌టెక్ ఈవెంట్ ముంబైలో ప్రారంభమైంది. మంగళవారం ప్రారంభమైన ఈవెంట్ నేటితో ముగియనుంది. డిజిటల్ ఎడిషన్‌తో ఈవెంట్ జరుగుతున్నది. ఈవెంట్‌ను కాన్‌స్టెల్లార్ ఎగ్జిబిషన్స్ (సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను టెమ్‌సెక్, సింగపూర్ ప్రెస్ హూల్డింగ్స్ అనుబంధ సంస్థ) నిరహిస్తున్నది. నీతి ఆయోగ్‌తో పాటు ఆరు కేంద్ర ప్రభుత మంత్రిత్వ శాఖలు మద్దతు ఇస్తున్నాయి. ఈవెంట్‌లో భాగంగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈఓ అనుబ్రత బిశ్వాస్ మాట్లాడుతూ.. అధిక మార్జిన్ తక్కువ విలువ.. తక్కువ మార్జిన్ అధిక విలువ కలిగిన ప్రోడక్ట్‌లతో బలమైన ఫైనాన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. ఇందులో రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లావాదేవీల ఖర్చు, వేగం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. టెక్నాలజీ వేగంతో లావాదేవీలు జరపడానికి బదులుగా.. ఫిన్‌టెక్ సంస్థలు ఆలోచన వేగంతో లావాదేవీలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని బిశ్వాస్ తెలిపారు.
భారత్‌లో డిజిటల్ వ్యవస్థ వృద్ధి
మొబిక్విక్ సహా వ్యవస్థాపకురాలు ఉపాసన టకు మాట్లాడుతూ.. గత దశాబ్ధంలో భారత్‌లో డిజిటల్ వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందినట్టు తెలిపారు. 200 మిలియన్‌ల మంది భారతీయులు డిజిటల్ లావాదేవీలు నిరహిస్తున్నారని వివరించారు. భవిష్యత్తులో ఇది 700 మిలియన్‌లకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. వినియోగదారుల ఆలోచనా విధానం చాలా వేగంగా మారుతున్నట్టు తెలిపారు. గత కొన్నేళ్లలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎంతో వేగంగా వృద్ధి సాధించాయన్నారు. మాస్టర్ కార్డ్ డిజిటల్ పార్టనర్‌షిప్స్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య మూర్తి మాట్లాడుతూ.. భారతీయ రిటైల్ పరిమాణం సుమారు 700 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. రాబోయూ రెండు, మూడేళ్లలో 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు. అమెజాన్ వెబ్ సరీసెస్, ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ ఫిన్‌టెక్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ సందీప్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఫిన్‌టెక్ చాలా వేగంగా వృద్ధి చెందిందన్నారు. ఫిన్‌టెక్ సేకరించిన నిధుల మొత్తం చాలా ఎక్కువగా ఉంది. భారతదేశం 2020లో 3.2 బిలియన్ డాలర్లు సేకరించింది. 2021లో 10.1 బిలియన్ డాలర్లు అందుకుంది. ఆసియా పసిఫిక్ జపాన్ 2020లో 10.8 బిలియన్లను, 2021లో 20.8 బిలియన్ డాలర్లు సేకరించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..