Friday, November 22, 2024

ఫిన్‌లాండ్‌, స్వీడన్‌ ప్రయత్నాలను అడ్డుకుంటాం.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ప్రకటన

హెల్సెంకీ : నాటోలో సభ్యతం తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటామని నార్డిక్‌ దేశాలైన ఫిన్‌లాండ్‌, సీడన్‌ ప్రకటించిన నేపథ్యంలో సభ్యదేశం టర్కీ వ్యతిరేకించింది. ఆ దేశాల ప్రయత్నాలను అడ్డుకుని తీరతామని, 30 దేశాల కూటమి అయిన నాటోలో ఏకగ్రీవ ఆమోదంతోనే చేరిక సాధ్యమవుతుందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ స్పష్టం చేశారు. కాగా ఎర్డోగాన్‌ ఒప్పించేందుకు రెండు దేశాలు తమ ప్రతినిధి బృందాలను టర్కీకి పంపేందుకు సిద్ధమవుతున్నాయి. తమ దేశంలో కుర్దు తీవ్రవాదులకు ఆ దేశాలనుంచి సహాయం అందుతోందని, ప్రత్యేకించి స్వీడన్‌ ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా మారిందని ఎర్డోగాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరియాలో ఆక్రమణల నేపథ్యంలో మూడేళ్ల క్రితం టర్కీపై ఈ రెండు దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో వాటిని నాటోలో చేర్చుకునే ప్రయత్నాలను నీరుగారుస్తామని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌లో రష్యా దండయాత్ర తరువాత తమ దేశాల భద్రతను దృష్టిలో పెట్టుకుని నాటోలో చేరికపై నిర్ణయం తీసుకున్నామని, తటస్థ విధానానికి స్వస్థి పలికామని, ఎవరి బెదరింపులను పట్టించుకోబోమని ఆ రెండు దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సభ్యతం తీసుకున్నప్పటికీ నాటో సైనిక స్థావరాలను తమ దేశాల పరిథిలో ఏర్పాటు చేయబోమని హామీ ఇచ్చాయి. ఫిన్‌లాండ్‌కు రష్యాతో దాదాపు 800 కి.మి. సరిహద్దు ఉంది. ఈ నేపథ్యంలో నాటోలో ఫిన్‌లాండ్‌, సీడన్‌ చేరికపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సోమవారంనాడు ప్రకటించారు. అయితే తమ సరిహద్దుల సమీపంలో నాటో కూటమి సైనిక మోహరింపులకు పాల్పడితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. శతాబ్దాలనాటి తటస్థవైఖరిని విడనాడిన ఆ దేశాల చర్య తమకు పెద్దవిషయం కాదని తేల్చి చెప్పారు. కాగా నాటోలో చేరేందుకు సిద్ధపడిన ఫిన్‌లాండ్‌, స్వీడన్‌ దేశాల అధ్యక్షులు సౌలి నినిస్తో, మగ్దలెనా అండర్సన్‌లకు అమెరికా అధ్యక్షుడు ఆతిథ్యం ఇవ్వనున్నారు. శేతసౌధంలో గురువారంనాడు వారికి బిడెన్‌ విందు ఇవనున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement