Sunday, November 24, 2024

ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే ఆంగ‌న్ వాడీల‌కు ఆర్థిక‌సాయం ప్ర‌క‌టించిన కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ అవకాశం కల్పిస్తూ, ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్‌లకు రూ.1,00,000/- రూపాయల లు, మరియు మినీ అంగన్‌వాడీ టీచర్లు , అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50,000/- అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జివో జారీ చూసింది. అంగన్ వాడి టీచర్లకు, హెల్పర్ లకు 50 ఏండ్ల వరకు 2లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం, 50 ఏండ్లుదాటిన వారికి 2 లక్షల రూపాయల ఏక్స్ గ్రేషియా కల్పించారు. దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద 20,000 లు, హెల్పర్లుకు 10 వేలు సాయం అందిస్తూ ప్రభుత్వం జీవో లు .జారిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు.

నేడు హైదరాబాదులోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో నేడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను యూనియన్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ … దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు పెద్ద పేట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉన్న అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద 20,000 లు, హెల్పర్లుకు 10 వేలు సాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతినెల 14వ తేదీ లోపు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్వాడీ టీచర్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోళికెరీ, జేడీలు లక్ష్మీదేవి సునంద, మరియు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు నల్లా భారతి, మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వరలక్ష్మి, టీఎన్జీవో నిర్మలతో పాటు పెద్ద ఎత్తున యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement