నిరుపేద వైద్య విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వ విప్ చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన నిరుపేద దళిత విద్యార్థిని కోట రవీన మెడిసిన్ లో సీటు సంపాదించింది. ఆ సరస్వతి పుత్రికకు, ఆమె విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు తాను బాధ్యత తీసుకుంటానని భరోసానిచ్చారు. అన్నారం గ్రామానికి చెందిన రవీన వికలాంగులు రాలు. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా చిన్ననాటి నుంచి చదువులో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తూ వస్తుంది.
ప్రభుత్వ గురుకులాల్లో ఇంటర్మీడియట్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినది.vనీట్ లోనూ ప్రతిభ కనబర్చింది. మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించింది. అయితే నిరుపేద కుటుంబం కావడం తో యూనివర్సిటీ ఫీజు,ఇతర ఖర్చులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 8లోగా ఫీజు చెల్లించకుంటే సీటు రద్దయ్యే అవకాశం ఉండటంతో స్థానికుల ద్వారా విప్ బాల్క సుమన్ కు తెలిసింది. దీంతో వెంటనే స్పందించిన సుమన్ రవీనకు అండగా నిలిచారు. ఆమెను తీసుకుని హైదరాబాద్ కు రావాలని స్థానిక నేతలను ఆదేశించారు.
రవీన తో పాటు ఆమె కుటుంబ సభ్యులు సుమన్ కలిశారు. ఆమె చదువులకు అవసరమైన లక్ష రూపాయల తక్షణ సహాయం తో పాటు వైద్య విద్య పూర్తయ్యే వరకు అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విప్ సుమన్ కు రవీన తో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఆపత్కాలం లో తమ బిడ్డ భవిష్యత్ కు అండగా నిలిచినందుకు హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించిన బాల్క సుమను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్డన్ సుమన్ అని అభినందించారు.