Saturday, November 23, 2024

జీఎస్టీ అమలు వల్ల పన్ను రేట్లు తగ్గాయి: కేంద్ర ప్రభుత్వం

దేశంలో జీఎస్టీ విధానం అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత వ‌స్తు, సేవ‌ల‌పై ప‌న్నులు భారీగా త‌గ్గాయ‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ ప్ర‌క‌టించింది. జీఎస్టీకి ముందు హెయిర్ ఆయిల్‌, టూత్ పేస్ట్‌, స‌బ్బులపై 29.3 శాతం ప‌న్ను వ‌సూలు చేసేవార‌ని, జీఎస్టీ కార‌ణంగా ఇప్పుడు అవి 18 శాతం ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చాయ‌ని ఆర్థిక శాఖ పేర్కొన్న‌ది. అదేవిధంగా గృహోప‌క‌ర‌ణాలు, వాషింగ్ మెషిన్‌లు, వ్యాక్యూమ్ క్లీనర్‌లు, టీవీల‌పై ప‌న్ను రేట్లు కూడా 31.3 శాతం నుంచి 18 శాతానికి త‌గ్గిన‌ట్లు తెలిపింది.

జీఎస్టీకి ముందు సినిమా టికెట్ల‌పై 35 శాతం నుంచి 110 శాతం వ‌ర‌కు ప‌న్నులు వ‌సూలు చేసేవార‌ని, టికెట్ ధ‌ర రూ.100 కంటే త‌క్కువ ఉన్న చోట్ల ప‌న్ను 12 శాతానికి త‌గ్గింద‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఓవ‌రాల్‌గా 400 ర‌కాల వ‌స్తువులు, 80 ర‌కాల సేవ‌ల‌పై ప‌న్ను త‌గ్గింద‌ని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ త‌గ్గింపుతో ప‌న్ను చెల్లింపుదారుల‌కు భారీ ఊర‌ట ల‌భించింద‌ని పేర్కొంది.

ఈ వార్త కూడా చదవండి: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వచ్చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement