Saturday, November 23, 2024

WPL | ఫైనల్స్ పోరు షురూ.. టాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ !

ప్రతిష్ఠాత్మకమైన ఉమెన్స్‌ ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) చివరి ఘట్టానికి చేరుకుంది. డ్యబ్లూపీఎల్ రెండవ సీజన్ ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. ఈ ఫైనల్ పోరలులో గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఢిల్లీకి ఇది వరుసగా రెండో ఫైనన్ కాగా, బెంగళూరు తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. కాగా, ఇవ్వాల్టి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

స్మృతి మంధాన (సి), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (WK), జార్జియా వేర్‌హామ్, సోఫీ మోలినెక్స్, దిశా కసత్, శ్రేయంక పాటిల్, ఆశా శోబన, రేణుకా సింగ్ ఠాకూర్.

ఢిల్లీ క్యాపిటల్స్:

మెగ్ లానింగ్ (సి), షఫాలీ వర్మ, అలిస్ కాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, తానియా భాటియా (వికె), మిన్ను మణి, శిఖా పాండే

- Advertisement -

ఢిల్లీ జట్టు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. బెంగళూరు శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైని ఓడించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. లీగ్ దశలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఒక పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో బలమైన ముంబైని ఓడించడంతో బెంగళూరు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. కెప్టెన్ స్మృథి మంధాన, సోఫి డివైన్, ఎలిసె పేరీ, రిచా ఘోష్ తదితరులతో బెంగళూరు బ్యాటింగ్ బలంగా ఉంది. పేరీ మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచింది.

ఢిల్లీలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, అలైస్ కాప్సె, జెమీమా రోడ్రిగ్స్, మరిజానే కాప్, సదర్లాండ్ వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. లానింగ్, కాప్సె, రోడ్రిగ్స్, షఫాలీలు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే బెంగళూరు బౌలర్లకు కష్టాలు ఖాయం. బౌలింగ్‌లో కూడా ఢిల్లీ బలంగా ఉంది. కాప్, శిఖా పాండే, సదర్లాండ్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement