Tuesday, November 26, 2024

Rahul Gandhi: ఎట్ట‌కేల‌కు రాహుల్ భార‌త్ జోడో న్యాయ యాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్..

ఇంపాలా – ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు అనుమతించింది. మ‌ణిపూర్ లోని ఇంఫాల్ హట్టా కంగ్జీబంగ్ దగ్గర భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం కానుంది. మొదట యాత్ర చేపట్టేందుకు మ‌ణిపూర్ ప్ర‌భుత్వం అనుమతి నిరాకరించింది. ఆ త‌ర్వాత మణిపూర్ పీసీసీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర, పార్టీ నాయకులతో కలిసి సీఎం బీరెన్ సింగ్ ను కలిసి అనుమ‌తి కోసం అభ్య‌ర్ధించారు.. దీంతో ఈ యాత్రకు కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే నేతలు పాల్గొనేందుకు అనుమతించింది మణిపూర్ ప్రభుత్వం. రాష్ట్రంలో శాంతిభద్రతల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే యాత్ర చేయాల‌ని నిబంధ‌న విధించింది..

100 లోక్ స‌భ స్థానాలు, 6713 కిలోమీట‌ర్ల యాత్ర..

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 14న ఇంఫాల్ లో ప్రారంభం కానుంది. మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. ఈ పాదయాత్ర 6,713 కిలోమీటర్ల మేర సాగి, 110 జిల్లాలు, సుమారు 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా సాగనుంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టాక ముంబైలో ముగుస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement