Friday, November 22, 2024

Finally Mumbai:ప్రాన్స్ చెర నుంచి భార‌తీయుల‌కు విముక్తి… ముంబాయికి చేరిన విమానం

ప్రాన్స్‌లో నిర్భంధానికి గురైన భార‌తీయుల‌కు ఎట్ట‌కేల‌కు విముక్తి ల‌భించింది. మానవ అక్రమ రవాణ అనుమానంతో నాలుగురోజుల పాటు ఫ్రాన్స్ దేశంలో నిర్బంధానికి గురైన రోమేనియన్ విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

మొత్తం 276 మంది ప్రయాణికులు భారత్‌కు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారని ఫ్రాన్స్ వర్గాలు తెలిపాయి. ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 27 మంది ఫ్రాన్స్‌‌లోనే ఉండిపోయారని పేర్కొన్నాయి. వారు ఫ్రాన్స్‌లో శరణార్థులుగా ఆశ్రయం కోరినట్టు తెలిపాయి. ఫ్రాన్స్‌లో నిర్బంధానికి గురైన విమానంలో ఎక్కువ మంది భారతీయులున్నారు.

ఫ్రెంచ్ అధికారులు విమానాన్ని తిరిగి వెళ్లేందుకు అనుమతించడంతో తిరిగి ముంబయికు వచ్చింది. ఈ విమాన ప్రయాణికుల్లో 21 నెలల చిన్నారి, 11 మంది తోడు లేని మైనర్లు ఉన్నారు. రోమేనియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న ఈ విమానం మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ముంబయికి చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement