ధరలు పెంపు, బెన్ ఫిట్ షో లపై చర్చించే అవకాశం
పుష్పా-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ఇకపై ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చేదిలేదని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. అదేవిధంగా సినిమా రేట్ల పెంపుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. చారిత్రక, తెలంగాణ ఉద్యమం వంటి సినిమాలకు మాత్రమే టికెట్ల రేట్లు పెంపు అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని తెలుగు సినీ ప్రముఖులు త్వరలో కలువనున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలవడంపై నిర్ణయం తీసుకుంటామని నిర్మాత నాగవంశీ చెప్పారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన వస్తుందని భావిస్తునట్లు ఆయన చెప్పారు.