Wednesday, November 27, 2024

పీజీ డెంటల్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ.. 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలో పీజీ దంత విద్య కోర్సుల్లో యాజ మాన్య కోటాలో ప్రవేశాలకుగాను ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్‌-ఎండీఎస్‌-2023 అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ ఎండీఎస్‌ డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు.

యాజమాన్య కోటాలో సీట్లభర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈనెల 9న ఉదయం 8 గంటల నుంచి 16న సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు యానివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement