వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: రాష్ట్రంలో పీజీ దంత విద్య కోర్సుల్లో యాజ మాన్య కోటాలో ప్రవేశాలకుగాను ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్-ఎండీఎస్-2023 అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ ఎండీఎస్ డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు.
యాజమాన్య కోటాలో సీట్లభర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈనెల 9న ఉదయం 8 గంటల నుంచి 16న సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు యానివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.