Friday, November 22, 2024

ఎఫ్‌ఐహెచ్‌ ఉమెన్స్‌ హాకీ వరల్డ్‌ కప్‌, భారత్‌ ఓటమి.. క్వార్టర్‌ ఆశలు సజీవం

ఎఫ్‌ఐహెచ్‌ ఉమెన్స్‌ హాకీ వరల్డ్‌ కప్‌-2022 టోర్నీలో భాగంగా ఫైనల్‌ గ్రూప్‌-స్టేజ్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్‌ చేతిలో 3-4తేడాతో ఓడిపోయింది. అయితే క్వార్టర్‌ ఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. క్వార్టర్‌ ఫైనల్‌కే చేరాలంటే… 10న స్పెయిన్‌తో తలపడే మ్యాచ్‌లో సవిత సేన తప్పనిసరిగా గెలవాల్సిందే. హాకీ వరల్డ్‌ కప్‌ టోర్నీలో భాగంగా పూల్‌ బిలోని భారత్‌- న్యూజిలాండ్‌ జట్లు తలపడ్డాయి. 4-3 తేడాతో టీమిండియాను న్యూజిలాండ్‌ మట్టి కరిపించింది. వందన కటారియా (4వ నిముషం), లాల్‌రెమ్సియమి(44వ నిముషం), గుర్జిత్‌ కౌర్‌ (59 నిముషం)లో గోల్‌ చేసి 3 పాయింట్లు తీసుకురాగా, న్యూజిలాండ్‌ క్రీడాకారులు ఒలివియా మెర్రీ డబుల్‌, టెస్సా జోప్‌, ఫ్రాన్స్‌ డవీస్‌ గోల్స్‌ చేసి 4 పాయింట్లు సాధించి, విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.

పూల్‌ బీలో న్యూజిలాండ్‌ 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌ 4 పాయింట్లు, ఇండియా, చైనా రెండేసి పాయింట్లతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఫోర్‌ పూల్స్‌లోని టాప్‌ నాలుగు జట్లు మాత్రమే నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరనున్నాయి. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు తదుపరి జరిగే క్రాస్‌- ఓవర్‌ మ్యాచుల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తేనే క్వార్టర్‌ ఫైనల్‌ చాన్స్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఆదివారంనాడు స్పెయిన్‌తో జరిగిన క్రాస్‌- ఓవర్‌ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement