Wednesday, November 20, 2024

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ 2023.. 24 మందితో భారత జట్టు ఖరారు

యూరోప్‌లో జరిగే ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ 2023కి భారత జట్టు ఎంపిక పూర్తయింది. 24 మంది సభ్యులతో కూడిన పురుషుల హాకీ జట్టుకు ఏస్‌ డ్రాగ్‌ ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌సింగ్‌ నాయకత్వం వహిస్తారు. కొత్త కోచ్‌ క్రెయిగ్‌ ఫుల్టన్‌ ఆధ్వర్యంలో భారత్‌కిది తొలి పర్యటన. ఇటీవల స్వదేశంలో జరిగిన లీగ్‌లో ప్రపంచ చాంపియన్లు జర్మనీ, ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా పాయింట్ల పట్టికలో భారత్‌ ముందుకు రాగలిగింది. యూరోప్‌లోనూ ఇదే జోష్‌ కొనసాగించి, బలీయమైన బెల్జియం, గ్రేట్‌ బ్రిటన్‌, నెదర్లాండ్‌, అర్జెంటీనాలపై గెలవాలని పట్టుదలతో ఉంది.

సోమవారం ప్రకటించిన 24 మంది సభ్యుల జట్టులో గోల్‌కీపర్‌ క్రిషన్‌ బహదూర్‌ పాఠక్‌ ఉన్నారు. డిఫెండర్‌ జాబితాలో హర్మన్‌ప్రీత్‌, అమిత్‌ రోహిదాస్‌, జర్మన్‌ప్రీత్‌సింగ్‌, సంజయ్‌, మన్‌దీప్‌ మోర్‌లు ఉన్నారు. మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ బ్యాక్‌లైన్‌ ప్లేయర్‌గా సుమిత్‌, గురిందర్‌తో కలిసి కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. వైస్‌కెప్టెన్‌ హార్దిక్‌ సింగ్‌తోపాటు దిల్‌ప్రీత్‌సింగ్‌, మొయిరంగ్‌థమ్‌, రవిచంద్ర సింగ్‌, షంషేర్‌సింగ్‌, ఆకాష్‌దీప్‌ సింగ్‌, వివేక్‌సాగర్‌ ప్రసాద్‌ మిడ్‌ఫీల్డర్లుగా ఉంటారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫార్వర్డ్‌ బృందంలోకి సిమ్రన్‌జీత్‌ సింగ్‌ మళ్లి వచ్చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement