భారత గడ్డపై త్వరలో మరో ప్రపంచకప్ పోటీ జరగనుంది. ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐహెచ్ హాకీ పురుషుల జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఆతిథ్య హక్కులను భారత్‌కు అప్పగించింది. ఈ విషయాన్ని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టర్కీ మంగళవారం తెలిపారు.
ఎఫ్‌ఐహెచ్ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టోర్నమెంట్ వచ్చే ఏడాది (2025) డిసెంబర్‌లో ప్రారంభమవుతుంది. అయితే ఈసారి రికార్డు స్థాయిలో టైటిల్ కోసం 24 జట్లు పోటీపడడం విశేషం. గతంలో భారత్‌లో ఈ టోర్నీ మూడుసార్లు జరిగింది. 2013, 2016, 2021లో కాగా, భారత్ ఈ పోటీలకు ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి.