రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తమబలగాలు దీటుగా పోరాడుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అమెరికా ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడుతూ, తాము ఎప్పటికీ లొంగిపోయేది లేదని స్పష్టంచేశారు. అమెరికా తమకు అందించిన సాయం ఛారిటీ కాదని, భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తున్నామని జెలెన్‌స్కీ తెలిపారు. అయితే ఉక్రెయిన్‌కు అండగా నిలవనున్నట్లు బిడెన్ మరోసారి పునరుద్ఘాటించారు. కొత్తగా రెండు బిలియన్ల డాలర్ల సహాయాన్ని అందించనున్నట్లు వెల్లడించారు.
సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బిడెన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ దేశాలను సమీకృతం చేస్తున్నట్లు తెలిపారు. రష్యా దాడితో సతమతం అవుతున్న ఉక్రెయిన్‌కు ఇప్పటికే 50 బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అమెరికా అందించింది. అయితే ఉక్రెయిన్‌కు బ్లాంక్ చెక్ ఇవ్వబోమని, బిడెన్ ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆ దేశ రిపబ్లికన్లు చెబుతున్నారు.