Friday, November 22, 2024

రంజాన్‌ మాసంలోనూ పోరాడాలి.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

ముస్లిం సోదరుల పవిత్ర మాసం రంజాన్‌ సమీపిస్తున్న వేళ.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్‌ నెలలోనూ ముస్లింలు పోరాడాలని సూచించారు. ఆయుధాలు వదలొద్దని, తమ దేశం కోసం పోరాటం ఆపొద్దని కోరారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. రష్యా దాడులతో ఇంధన సమస్య నెలకొందని, దీన్ని పూడ్చేందుకు అరబ్‌ దేశాలన్నీ ఉత్పత్తిని పెంచాలని కోరారు. పోర్టు నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు తెగబడుతోందని, ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలన్నీ తమకు సాయం చేయాలని విన్నవించాడు.

సిరియాలోని అలెప్పో తరహాలో మరియుపోల్‌ నగరం ధ్వంసమైందన్నారు. ఉక్రెయిన్‌ నుంచి ఎగుమతులు నిలిచిపోతే.. ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పుకొచ్చారు. గోధుమల సరఫరా నిలిచిపోతే.. మిడిల్‌ ఈస్ట్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement