Wednesday, December 4, 2024

Fifth Day – పార్లమెంట్ లో కొనసాగుతూనే ఉన్న అదాని రచ్చ ..

త‌మిళ‌నాడులో వ‌ర‌ద‌లు..
బంగ్లాదేశ్ లో హిందువుల‌పై దాడులు
సంబాల్ లో హింసాకాండ‌పై విఫ‌క్షాల వాయిదా తీర్మానాలు
వెన‌క్కి త‌గ్గ‌ని విప‌క్షాలు
ప‌ట్టు వీడ‌ని అధికార కూట‌మి
ఐదో రోజు సేమ్ సీన్
పార్లమెంట్ ఉభయ సభలు రేప‌టికి వాయిదా

న్యూ ఢిల్లీ – నేడు పార్ల‌మెంట్ సమావేశాలు ప్రారంభ‌మైన వెంట‌నే ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త అదానీ లంచం ఆరోపణలు, సంభాల్ ఇష్యూ, తమిళనాడు వరదలు, బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు, అజ్మీర్ షరీఫ్ దర్గా అంశంపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ మేరకు ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. అమెరికాలో అందానీ లంచం ఆరోపణలపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లోక్ సభ స్పీకర్ కు వాయిదా తీర్మానం ఇచ్చారు.

ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని విల్లుపురం, కడలూరు, చెంగల్‌పట్టు, పుదుచ్చేరి జిల్లాల్లో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు, భారీ వరదల కారణంగా నిలిచిన పంటలు, ఆస్తుల నష్టంపై చర్చించాలని డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు

- Advertisement -

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అకృత్యాలు, చిన్మోయ్ కృష్ణ దాస్‌తో సహా ముగ్గురు ఇస్కాన్ సన్యాసుల అరెస్టుపై చర్చకు పట్టబుడుతూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో బిజినెస్ నోటీస్ ప్రవేశపెట్టారు. సంభాల్ హింసాకాండ, అజ్మీర్ షరీఫ్ దర్గా అంశంపై చర్చ కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి రాజ్యసభ చైర్మన్ కు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను రాజ్య సభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ తిరస్కరించారు.

దీంతో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అదానీ, సంభాల్ ఇష్యూపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీకి వ్యరేతికంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులను కంట్రోల్ చేసేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ సభ ఆర్డర్ లో లేకపోవడంతో పార్లమెంట్ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ కార్యకలాపాలు ప్రారంభం కాగా.. మళ్లీ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలను రేప‌టికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement