మహిళల ప్రపంచకప్‌లో జర్మనీ అద్భుత ఆరంభాన్ని అందిపుచ్చుకుంది. కెప్టెన్ అలెగ్జాండ్రా పాప్ రెండు గోల్స్ కొట్టి జట్టును విజయపథంలో నడిపించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో మొరాకోపై 6-0తో తిరుగులేని విజయాన్ని సొంతంచేసుకుంది. మొరాకో ఎక్కడా పోటీ ఇస్తున్నట్లు కనిపించలేదు. 11వ నిముషంలోనే జర్మనీ కెప్టెన్ పాప్ సమయస్ఫూర్తితో స్పందించి హెడర్‌తో గోల్ కొట్టింది. హాఫ్‌టైమ్‌కు ముందు మరో హెడర్‌తో జట్టును 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. సెకండాఫ్‌లో క్లారా బుల్, లీ షుల్లర్ ఛెలరేగారు. ఈ విజయంతో గ్రూప్ హెచ్లో జర్మనీ అగ్రస్థానం దక్కించుకుంది.
అర్జెంటీనాపై ఇటలీ విజయం
గ్రూప్ జిలో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాపై 1-0 గోల్స్‌తో ఇటలీ గెలుపొందింది. ఈడెన్ పార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా ఆడిన క్రిస్టియానా గిరెల్లి సాధించిన ఏకైక హెడర్ గోల్‌తో ఇటలీ 1-0 విజయాన్ని దక్కించుకుంది. మైదానంలోకి అడుగుపెట్టిన తొలి నాలుగు నిముషాల్లోనే ఆమె గోల్ కొట్టింది. ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో రెండు ఎడిషన్లలో స్కోర్ చేసిన తొలి క్రీడాకారిణిగా గిరెల్లి నిలిచింది. 2019 ఫైనల్స్‌లో జమైకాపై ఆమె హ్యాట్రిక్ సాధించింది.