ఫీఫా మహిళల ప్రపంచకప్‌లో ఫ్రాన్స్, కొలంబియా జట్లు క్వార్టర్ ఫైనల్లో దూసుకెళ్లాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, స్వీడన్, నెదర్లాండ్స్, జపాన్, స్పెయిన్ జట్లు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించగా.. తాజాగా ఫ్రాన్స్, కొలింబియా జట్లు వారి సరసన నిలిచాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ (4-0) గోల్స్‌తో మొరాకో జట్టును చిత్తు చేసింది.
ఫ్రాన్స్ తరఫున 15వ నిమిషంలో కాడిడియాటో డియాని, (20వ) నిమిషంలో కెన్జా డాలీ గోల్స్ సాధించగా.. లీ సోమెర్ (23వ, 70వ) నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ సాధించి ఫ్రాన్స్‌కు ఘన విజయాన్ని అందించింది. మొరాకో జట్టు నుంచి ఒక గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో ఆ జట్టు ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఫ్రాన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.
ఇక క్వార్టర్స్ పోరులో ఫ్రాన్స్ ఆతిథ్య ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక్కడ జరిగిన మరో మ్యాచ్‌లో కొలంబియా జట్టు (1-0) గోల్‌తో జమైకాకు షాకిచ్చింది. మ్యాచ్ 51వ నిమిషంలో కటలినా ఉస్మే అద్భుత గోల్ సాధించింది. మ్యాచ్‌లో ఏకైక గోల్ చేసిన కొలంబియా జట్టు విజేతగా నిలిచింది. ఇక క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో కొలంబియా ఢీ కొననుంది.
క్వార్టర్ ఫైనల్లో ఎవరితో ఎవరూ తలపడనున్నారు
స్పేయిన్-నెదర్లాండ్స్ (శుక్రవారం)
జపాన్-స్వీడన్ (శుక్రవారం)
ఆస్ట్రేలియా-ఫ్రాన్స్ (శనివారం)
ఇంగ్లండ్-కొలంబియా (శనివారం)