Tuesday, November 19, 2024

ఫిఫా గోల్‌ స్టార్స్‌.. ఒక టోర్నీలో అత్యధిక గోల్స్‌ వీరులు

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో గోల్‌ కొట్టడటమే ఒక రికార్డు. మరపురాని జ్ఞాపకం. అంతకు మించి ఆటగాడిగా అంతర్జాతీయ గుర్తింపు. అలాంటిది ఒక టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేయడమంటే అరుదైన రికార్డే కదా. 1930 నుంచి ఇప్పటి వరకు జరిగిన అలాంటి అత్యధిక గోల్స్‌ చేసిన టాప్‌-5 ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. ఈ జాబితాలో జస్ట్‌ ఫాంటైన్‌ (ఫ్రాన్స్‌), శాండర్‌ కొక్సిస్‌ (హంగేరి), గెర్డ్‌ ముల్లర్‌ (జర్మనీ), ఫెర్రీరా యూసెబియో (పోర్చుగల్‌), రొనాల్డొ (బ్రెజిల్‌) ఉన్నారు.

ఫాంటైన్‌ (ఫ్రాన్స్‌):

స్వీడన్‌లో జరిగిన 1958 ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ లెజండరీ ప్లేయర్‌ ఫాంటైన్‌ అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆ టోర్నీలో అతడు ఏకంగా 13 గోల్స్‌ కొట్టాడు. ఇప్పటికీ అత్యధిక గోల్స్‌ రికార్డు అతడిపేరిటే ఉంది. ఫాంటైన్‌ 2004లో రూపొందించిన టాప్‌-125 వర్తమాన ఆటగాళ్ల జాబితాలో పీలే పేరును పొందుపరిచారు.

శాండర్‌ కొక్సిస్‌ (హంగేరి):

1954 ప్రపంచకప్‌లో హంగేరికి చెందిన శాండర్‌ కొక్సిస్‌ 11గోల్స్‌ చేశాడు. 1979లో మరణించాడు. అప్పటికి అతడి వయసు 49 ఏళ్లు మాత్రమే. స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో టాప్‌ గోలర్‌గా నిలిచాడు. ఈ రికార్డుకు ముందు అతడు రెండు ప్రపంచకప్‌లలో హ్యాట్రిక్‌ సాధించిన మొదటి ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. దీనికి రెండేళ్ల ముందు (1952)లో హంగేరి ఒలింపిక్స్‌లో ఆరు గోల్స్‌ కొట్టి గోల్డ్‌మెడల్‌ దక్కించుకున్నాడు.

- Advertisement -

గెర్డ్‌ ముల్లర్‌ (జర్మనీ):

జర్మనీ ఫుట్‌బాల్‌ దిగ్గజం గెర్‌ ్డ ముల్లర్‌ 10 గోల్స్‌తో మెగా టోర్నీ టాప్‌ -3 గోలర్‌గా ఉన్నాడు. 1970 ప్రపంచకప్‌లో ఈ రికార్డు సాధించాడు. మొత్తంగా ప్రపంచకప్‌ గోల్స్‌లోనూ అతడు 14 గోల్స్‌తో మూడవ స్థానంలో ఉన్నాడు. ముల్లర్‌ కంటే ముందు మిరొస్లావ్‌ క్లోజ్‌ (16), బ్రెజిల్‌ ప్లేయర్‌ రొనాల్డొ (15) ఒకటి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఫెర్రీరా యూసెబియో (పోర్చుగల్‌):

నల్ల చిరుతగా పేరుగాంచిన యూసెబియో ఫుట్‌బాల్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 745 మ్యాచ్‌లలో 733 గోల్స్‌తో అరుదైన రికార్డును కలిగివున్నాడు. 1966 ప్రపంచకప్‌ టోర్నీలో ఆరు మ్యాచ్‌లలో 9 గోల్స్‌ చేశాడు. ఇందులో నాలుగు పెనాల్టిd గోల్స్‌ కావడం విశేషం. క్వార్టర్‌ ఫైనల్‌లో ఉత్తర కొరియాపై యుసెబియో నాలుగు గోల్స్‌ చేసి, జట్టుకు విజయాన్ని అందించాడు. 0-3 తో వెనుకబడి వున్న పరిస్థితి నుంచి పోర్చుగల్‌ను విజేతగా నిలిపాడు.

లూయిస్‌ రొనాల్డొ (బ్రెజిల్‌):

ఫుట్‌బాల్‌ ప్రపంచంలోకి పోర్చుగల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో తెరపైకి రాకముందు ఇంకొక రొనాల్డొ ఉండేవాడు. అతడి పేరు లూయిస్‌ రొనాల్డొ. ఇతను బ్రెజిల్‌ స్ట్రయికర్‌. లూయిస్‌ రొనాల్డొ కొత్త తరం స్ట్రయికర్స్‌కు రోల్‌మోడల్‌గా నిలిచాడు. స్ట్రయికర్‌ పొజిషన్‌కు కొత్త కోణాన్ని జోడించాడు. 2002 ప్రపంచకప్‌లో 8 గోల్స్‌ చేశాడు. బ్రెజిల్‌ ఐదవసారి ఫిఫా కప్‌ నెగ్గడంలో ముఖ్య భూమిక పోషించాడు. తాను గాయం నుంచి కోలుకోవడానికి కృషిచేసిన ఆస్పత్రి సిబ్బందికి 2002 ఫిఫా ప్లేయర్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ ట్రోఫీని అంకితమిచ్చాడు. ఓవరాల్‌టో మెగా టోర్నీ సింగిల్‌ ఎడిషన్‌లో టాప్‌-5 గోలర్‌గా ఉన్నాడు.

    Advertisement

    తాజా వార్తలు

    Advertisement