Friday, November 22, 2024

ఫిఫా ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌ వచ్చేస్తోంది.. 20న ఖతార్‌లో ప్రపంచకప్‌ ఆరంభం

ఫిఫా పుట్‌ బాల్‌ ప్రపంచకప్‌ వచ్చేస్తోంది. మరో ఎనిమిది రోజుల్లో విశ్వ సాకర్‌ సమరానికి తెరలేవనుంది. 32 జట్లు, ఒక కప్పు అటు మైదానంలో పోటీ ఇటు అభిమానులకు కిక్కు ఇక మాయలో పడేందుకు సిద్దమైపోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఆటలో అత్యున్నత టోర్నీకి రంగం సిద్దమవుతోంది. ఈ నెల 20న ఖతార్‌లో ప్రపంచకప్‌ ఆరంభమవుతుంది. దాదాపు నెల రోజుల పాటు సాగే ఇక కిక్కే కిక్కు! ఖతార్‌ జాతీయ దినోత్సవమైన వచ్చే నెల 18న ఫైనల్‌ జరుగుతుంది. ఆ దేశం తొలిసారి ఈ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోంది. అక్కడ అధిక ఊష్ణోగ్రతల ప్రభావాన్ని తప్పించుకోవడం కోసం శీతాకాలంలో మ్యాచులు నిర్వహించనున్నారు.

కప్పు దిశగా

అర్హత టోర్నీలు దాటి నిలకడైన ప్రదర్శనతో మెప్పించి మొత్తం 32 జట్లు ఈ మెగా టోర్నీలో పోటీ పడేందుకు అర్హత సాధించాయి. ఈ జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో గ్రూపులోని ప్రతి జట్టూ మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్టు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. మొత్తం 16 జట్లు ప్రిక్వార్టర్స్‌లో తలపడతాయి. అక్కడి నుంచి క్వార్టర్స్‌ , సెమీస్‌, ఫైనల్‌ వరుసగా జరుగుతాయి. అయిదు నగరాల్లోని ఎనిమిది స్టేడియాల్లో కలిపి మొత్తం 64 మ్యాచ్‌ లు నిర్వహిస్తారు. అక్కడి ఊష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం ఈ స్టేడియాలన్నింటిలోనూ ఏసీలు ఏర్పాటు చేశారు. ఖతార్‌ , ఈక్వెడార్‌ మధ్య తొలిపోరు జరుగుతుంది. ఎక్కువ వ్యయంతో తక్కువ రోజుల్లో ముగిసే ప్రపంచకప్‌ ఇదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement